రేపు మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో CMRF చెక్కుల పంపిణీ

KMM: తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. క్యాంపు కార్యాలయానికి వచ్చే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.