బట్టల షాపులో గంజాయి స్వాధీనం

బట్టల షాపులో గంజాయి స్వాధీనం

PLD: నరసరావుపేట గుంటూరు రోడ్డులోని బట్టల షాపులో గురువారం రెండో పట్టణ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. షాపులోని గదిలో నిల్వ ఉంచిన 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా నివాసి ఊదర నాగేశ్వరరావు గంజాయిని నిల్వ ఉంచినట్లు ఎస్సై ప్రియాంక తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.