తల్లిని చూడాలన్న కొడుకు ప్రయాణం… చివరకు విషాదాంతం
కృష్ణా: తల్లిని చూడాలన్న కొడుకు ప్రయాణం చివరకు కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. విజయవాడ-మచిలీపట్నం హైవేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సివిల్ ఇంజనీర్ రంగబాబు మృతి చెందారు. ఉద్యోగరీత్యా HYDలో నివసిస్తున్న ఆయన, తల్లి కోసం మచిలీపట్నంకు కారులో బయలుదేరారు. పామర్రు(M) కురుమద్దాలి అండర్‌పాస్ ఫ్లైఓవర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.