శ్రీలంకకు భారత సైన్యం ఆపన్నహస్తం!
శ్రీలంకలో భారత ఆర్మీ దుమ్మురేపుతోంది. ఇటీవల తుఫాన్ వల్ల అక్కడ దెబ్బతిన్న రవాణా వ్యవస్థను సరిచేయడానికి మన సైన్యం రంగంలోకి దిగింది. శ్రీలంక ఆర్మీతో కలిసి చిలావ్, జాఫ్నాలోని కిలినోచ్చిలో 'బెయిలీ బ్రిడ్జి'ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే డ్యామేజ్ అయిన బ్రిడ్జిని తొలగించి, కొత్త బ్రిడ్జి పనులు స్పీడప్ చేశారు. భారత ఆర్మీ సేవలకు అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.