పుంగనూరులోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
CTR: క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగాఆదివారం పుంగనూరులోని చర్చిలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నాగపాల్యంలోని సీఎస్ఐ హార్ట్ అండ్ మెమోరియల్ చర్చి, మర్లపల్లి, ఇందిరా సర్కిల్ చర్చిలతోపాటు కొత్తపేట, కొత్త ఇండ్లు, మేలుపట్ల, పూజగాని పల్లి ప్రార్థన మందిరాల్లో క్రైస్తవులు యేసు ప్రభువును కీర్తిస్తూ ఆరాధనలు చేపట్టారు.