నందిని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని యూత్ సభ్యులు తెలిపారు. పోటీలో విజేతలైన మొదటి ముగ్గురికి బహుమతులు అందజేస్తామన్నారు. వాలిబాల్ గ్రౌండ్‌లో రేపు ఉదయం 10 గంటల నుంచి పోటీ మొదలవుతుందని వారన్నారు.