నెక్కొండలో ఘనంగా గోన మైసమ్మ బోనాలు

MBNR: జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో గురువారం గోన మైసమ్మ, గ్రామ దేవతలకు మా పాడి పంటలను చల్లగా దీవించు తల్లి అంటూ బండ్ల, బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను అంగరంగా వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో గ్రామస్తులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.