చెన్నకేశవ స్వామి ఆలయంలో రేపు వరలక్ష్మీవ్రతం

చెన్నకేశవ స్వామి ఆలయంలో రేపు వరలక్ష్మీవ్రతం

అన్నమయ్య: రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 8:30 గంటలకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలకు అమ్మవారి కుంకుమ, గాజులు, పసుపుదారం, కంకణాలు ఉచితంగా అందజేస్తామన్నారు. మహిళలు వ్రతంలో పాల్గొనాలని కోరారు.