'ప్రతి షాపు ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి'

'ప్రతి షాపు ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి'

ప్రకాశం: పామూరు పట్టణంలోని ప్రతి షాప్ ముందు సీసీ కెమెరాలు, పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సీఐ వినోద్ కుమార్ కోరారు. మంగళవారం పట్టణంలోని షాపు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు అడ్డదిడ్డంగా ఆపకుండా సరైన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా భద్రతా ప్రమాణాలను యజమానులు కచ్చితంగా పాటించాలన్నారు.