ఘనంగా కేఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు
RR: మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను బాలాపూర్ చౌరాస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామెడి గోపాల్ రెడ్డి కేక్ కట్ చేసి, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కేఎల్ఆర్ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.