వెబ్ సైట్‌లో 10వ తరగతి మెమోలు

ప్రకాశం: ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు సాధించిన విద్యార్థుల మెమోలు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నట్లుగా DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థుల మెమోలను HMలు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మెమోలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే ఈనెల 25వ తేదీ లోపు HM ధృవీకరించిన పేపర్ విజయవాడకు పంపించాలని DEO పేర్కొన్నారు.