తెనాలిలో భవన నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్
GNTR: తెనాలిలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పల నాయుడు మంగళవారం పర్యటించారు. 12, 13 వార్డులలో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించారు. కొన్ని చోట్ల అనధికారిక నిర్మాణాలను గుర్తించి సిబ్బందిని ప్రశ్నించారు. ఆయా నిర్మాణల వద్ద కొలతలు వేయించారు. నిబంధనలు పాటించకుండా చేపట్టే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.