VIDEO: రాఘవాపురంలో హైవే పక్కన చోరీ
SRPT: మోతే మండలం రాఘవపురంలో కేబుల్ దొంగలు వరుస చోరీలతో రెచ్చిపోతున్నారు. మొన్న ఐదుగురు రైతుల కేబుల్స్ మాయం కాగా, తాజాగా హైవే పక్కన ఉన్న వ్యవసాయ బోర్ల స్టార్టర్ వైర్లను దొంగలు కత్తిరించుకెళ్లారు. పోలీసులు వెంటనే స్పందించి గస్తీ పెంచాలని, దొంగలను పట్టుకుని తమ పంటలను కాపాడాలని రైతులు అధికారులను కోరుతున్నారు.