'శత శాతం ఉత్తీర్ణత సాధించాలి'
అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బీసీ వసతి గృహాలకు చెందిన 10, ఇంటర్ విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలన్నారు. విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.