బీజేపీ నిజామాబాద్ జిల్లా నూతన కమిటీ నియామకం

NZB: బీజేపీ జిల్లా నూతన కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్, బంటు రాము, రాంచందర్, సురేందర్, ప్రమోద్, పాలేపు రాజు, జిల్లా కార్యదర్శులుగా అనిల్, నర్సారెడ్డి, వేణు, జ్యోతి, రాధ, సవితను నియమించారు.