VIDEO: విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృత్యువాత
ASF: రెబ్బెన మండలం వాంకులం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృత్యువాత పడింది. బోర్కుటే పండిత్ అనే రైతుకు చెందిన ఎద్దు వర్షానికి ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో నిలిచిన నీటి గుంతలోకి వెళ్లగా, ప్రమాదవశాత్తు విద్యుదఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయానికి ఆసరాగా ఉన్న పశువు మరణించడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కన్నీరు మున్నీరవుతున్నారు.