మండపేటలో సినిమా షూటింగ్ చిత్రీకరణ
కోనసీమ: మండపేట విజయ మహల్ దగ్గర సినీ షూటింగ్ కారణంగా సందడి నెలకొంది. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లతో మెయిన్ రోడ్‌లో చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలను శనివారం చిత్రీకరించింది. నూతన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సన్నివేశాలను మండపేట, రావులపాలెం, వాడపల్లి, లొల్ల లాకుల వద్ద చిత్రీకరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.