జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి వర్ధంతి
AKP: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు ఎస్పీ దేవప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు. భాష ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా నిలిచిపోయారన్నారు.