నేడు కొమరోలులో పవర్ కట్

ప్రకాశం: కొమరోలు మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. చింతలపల్లి, పుల్లారెడ్డిపల్లి పంచాయతీలలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు కోరారు.