పోలీస్ వెబ్‌సైట్‌లకు హ్యాకింగ్ బెడద

పోలీస్ వెబ్‌సైట్‌లకు హ్యాకింగ్ బెడద

TG: రాష్ట్రంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు హ్యాకింగ్ బెడద ఎక్కువైంది. ఏకంగా పోలీస్ కమిషనరేట్ల అధికారిక సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. గత 10 రోజులుగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ సైట్లు.. లింక్ ఓపెన్ చేస్తే, అవి నేరుగా బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రస్తుతం ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసింది.