VIDEO: కంకర రోడ్లతో వాహనదారుల ఇక్కట్లు

VIDEO: కంకర రోడ్లతో వాహనదారుల ఇక్కట్లు

WGL: నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, గొల్లపల్లి, నర్సింగాపురం, నారక్కపేట తదితర గ్రామాలను కలుపుతున్న కంకర రోడ్లు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వం కంకర వేసి రోడ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేయడంతో రోడ్లు పూర్తిగా కంకర తేలిపోయాయి. వాహనాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారలు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.