పెద్దపులి కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు
ADB: సిరికొండ మండలంలోని సాత్ మొరి గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. మేస్రం బొజ్జుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఘటనా స్థలాన్ని ఇచ్చోడ రేంజ్ అధికారి నాగవత్ స్వామి, సిరికొండ సెక్షన్ ఆఫీసర్ చంద్ర రెడ్డి, అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.