సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు 54 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.