ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: కలెక్టర్

NZB: ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూడైస్‌లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. అవసరమైన వారి ఆధార్ వివరాలను అప్డేషన్ చేయించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.