పరిశుభ్రతపై మెడికల్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

పరిశుభ్రతపై మెడికల్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

ELR: నూజివీడు పట్టణంలోని కోనేరు పేట పీహెచ్‌సీ పరిధిలో వర్షాకాలంలో పరిశుభ్రతపై మెడికల్ సిబ్బంది బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ ఎస్ సాయి సుధా మాట్లాడుతూ.. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే సేవించాలన్నారు. వేడివేడి ఆహారం తీసుకోవాలని.. రోడ్ల వెంట ఆహార పదార్థాలను వినియోగించవద్దన్నారు. దోమతెరలతో జ్వరాల నుంచి రక్షణ పొందాలన్నారు.