VIDEO: స్థానికులతో కలిసి కవిత ఆందోళన
RR: నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టగా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.