మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క
MLG: స్టేట్ టు స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు మేఘాలయలో పర్యటించనున్నారు. మహిళా, శిశు అభివృద్ధి రంగాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయనున్నారు. మిషన్ 1000 డేస్, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిని పరిశీలిస్తారు.