విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన కిషన్ అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి స్టార్టర్ సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.