గంజాయి మత్తులో దాడి.. వీడియో వైరల్
WGL: నగరంలోని లేబర్ కాలనీలో సురేష్ అనే వ్యక్తిపై కొంతమంది గంజా సేవించిన యువకులు బండరాయితో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఘటనపై పోలీసులు అధికారికంగా స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.