విశాఖలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నరసింహనగర్ రైతు బజార్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో శనివారం 'రచ్చ బండ' కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని 14వ వార్డు కార్పొరేటర్ కే. అనిల్ కుమార్ రాజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కే.కే. రాజు పాల్గొన్నారు.