మాజీ జెడ్పీటీసీ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత

మాజీ జెడ్పీటీసీ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత

JN: పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ కొనుగోలు చేసిన ఇంటి స్థలం సర్వే నెంబర్ 565/Aలోని ప్రహరీ గోడ ప్రభుత్వ భూమిలో ఉందని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇవాళ ఏసీపీ నర్సయ్య పర్యవేక్షణలో సుమారు 200 మంది పోలీసు బందోబస్తు మధ్య ఈ చర్య చేపట్టారు. ఇది ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యలో భాగమేనని శ్రీనివాస్ ఆరోపించారు.