ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
VZM : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజపతినగరంలోని పిఎసిఎస్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు లెంక బంగారునాయుడు, సీఈఓ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.