'పాక్‌ను నమ్మి తిరిగి ఇళ్లకు వెళ్లలేం'

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలైన ఉరి, రాజౌరీ, పూంఛ్, అక్నూర్ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్లాలని J&K ప్రభుత్వం సూచించింది. అయితే.. పాక్‌ను నమ్మలేమని, ఏ క్షణమైనా ఫైరింగ్ జరిగే అవకాశముందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు.