VIDEO: రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

MDK: నార్సింగ్ మండలం శేరి పల్లి గ్రామంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ పర్యటించారు. స్థానిక రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.