గణపతి విగ్రహాలు ఫుట్ పాత్‌పై పెట్టకండి: పోలీసులు

HYD: గణపతి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ HYD నగరంలోని అనేక చోట్ల గణపతి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల ఫుట్ పాత్, రహదారులపై వాటిని ఉంచి విక్రయిస్తుండగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన సైబరాబాద్ పోలీసులు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుట్ పాత్, రోడ్లపై విగ్రహాలు పెట్టి విక్రయించొద్దన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.