బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారికి అష్టాదళపద్మారాధన

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారికి అష్టాదళపద్మారాధన

విశాఖ: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం వేకువజాము నుంచి అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు పుష్పాలతో అష్టాదళ పద్మారాధన జరిపారు. అష్టదళ పద్మా రాధన సేవలో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో శోభారాణి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.