గాజా తగలబడుతోంది: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి

గాజా తగలబడుతోంది: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ విషయాన్ని దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. బందీలను విడుదల చేయించేందుకు.. హమాస్‌ను ఓడించేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు. 'గాజా తగలబడుతోంది. IDF దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడుతున్నాయి. లక్ష్యం పూర్తయ్యేవరకు మేము ఏమాత్రం ఉపేక్షించం, సహించం' అని పేర్కొన్నారు.