ధర్మపురిలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

JGL: తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వర్షం కారణంగా ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయం ముందు వర్షం నీరు నిలువడంతో దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు. ధర్మపురి లోని కాశెట్టి వాడలో పాత ఇల్లు వర్షానికి కూలి పోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.