'కడప హజ్ హౌస్‌ను పునః ప్రారంభించాలి'

KDP: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం మేరకు, నారా లోకేష్ కడప పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా కడప హజ్ హౌస్‌ను వెంటనే పునః ప్రారంభించాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కోరారు. మంగళవారం కడపలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ మళ్లీ ఆ హామీని నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.