నాగావళి నదిలో జారిపడి వృద్ధుడు గల్లంతు

నాగావళి నదిలో జారిపడి వృద్ధుడు గల్లంతు

SKLM: నాగావళి నదిలో బహిర్భూమికి వెళ్లి నదిలో జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సంతకవిటి మండలం పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీసుకునేందుకు నది ఒడ్డుకు వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి పడిపోవడంతో నదిలో కొట్టుకుపోయారని బంధువులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు.