రేపు గద్వాలకు మంత్రి రాక..!

GDWL: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు గద్వాలకు వస్తారని జిల్లా సమాచార శాఖ అధికారి అరీపుద్దీన్ శుక్రవారం ప్రకటించారు. మంత్రి రేపు ఉదయం 11:00 గంటలకు గద్వాల చేరుకుని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందజేసి, వారితో సహ పంక్తి భోజనం చేస్తారు.