పోలీసుల తనిఖీలు.. దోరికిన ఆర్టీసీ డ్రైవర్..!
MNCL: మద్యం తాగి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి కోరుట్ల డిపోకు చెందిన బస్ డ్రైవర్ జక్కుల మల్లేశ్ను పరీక్షంచగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది.దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.