మార్కెట్ యార్డ్ పరిధిలో కంపచెట్ల తొలగింపు
NTR: తిరువూరు ఏఎంసీ పరిధిలోని గంపలగూడెం మార్కెట్ యార్డ్ చుట్టూ ఉన్న పాత కంపచెట్లను తొలగించే కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు మార్కెట్ యార్డ్‌ను శుభ్రంగా, సౌకర్యవంతంగా మార్చి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.