ప్రభుత్వ బడుల్లోనే చదువు: యూటీఎఫ్
ASR: డుంబ్రిగూడ మండలం లక్క వారపు సంతలో మంగళవారం 'ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం- ఊరి బడిని కాపాడుకుందాం' అనే అవగాహన కార్యక్రమాన్ని ఏపీ యూటీఎఫ్ మండల శాఖ నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలు దేశ అభివృద్ధికి మూలస్తంభాలని నాయకులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.