డోన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి
NDL: డోన్‌లోని రోడ్లు కాలువలు నిర్మించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బీజేపీ ఐటీ కన్వీనర్ అరబోలు వీరేష్ బాబు సోమవారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీరామ్ నగర్ వైయస్సార్ నగర్ ఇందిరానగర్ తారక రామ నగర్ టీచర్స్ కాలనీ నెహ్రూ నగర శ్రీనివాస నగర్ సహా పలు కాలనీలలో రోడ్లు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.