VIDEO: కుస్తీ పోటీల్లో అలరించిన మల్లయోధురాలు

VIDEO: కుస్తీ పోటీల్లో అలరించిన మల్లయోధురాలు

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం కుస్తీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఇందులో భాగంగా ఢీల్లీకి చెందిన బల్జిత్ కౌర్ అనే మల్లయోధురాలు పాల్గొన్నారు. ఆమె కుస్తీ పడుతూ గ్రామస్థులను కొద్దిసేపు అలరించారు. చివరిగా సమవుజ్జీలుగా ఇద్దరికీ నగదు బహుమానం ఇచ్చినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.