'కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

'కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

ASR: జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కుష్టు వ్యాధి నివారణపై ముద్రించిన పోస్టర్లను గురువారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డా.కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలో 2022 నుంచి 2025 వరకూ మొత్తం 50 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరు చికిత్సలు తీసుకుంటున్నారని, ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.