రామడోలి పండుగకు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు.
ASR: అరకులోయ మండలం పరిధిలోని బస్కి గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన రామడోలి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఈ మేరకు గిరిజన సాంప్రదాయ పద్దతిలో రామ, లక్ష్మణ, భరత, శతృఘ్న అనే నలుగురు పిల్లలు ఉయ్యాల ఊగుతుండగా ఆసక్తికరంగా తిలకించారు. ఈ ఉత్సాహం రాష్ట్రంలో బస్కితో పాటు ఒడిశాలోని ఒడ్రుగోడ్ లో మాత్రమే జరుగుతుంది.