విద్యార్థిని అభినందించిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నంకు చెందిన విద్యార్థి మాగంటి ధన్విన్ ఇటీవల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్-16కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర సదరు బాలుడిని కలిశారు. అతనికి స్వీట్ తినిపించి, అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, ఇండియన్ క్రికెట్ టీంలో అవకాశం దక్కించుకునేంత వరకు విశ్రమించొద్దని సూచించారు.