తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీ లు ధర్నా
కోనసీమ: అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనకు జీతం రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.